కాకినాడలో యాక్సిడెంట్.. ఇద్దరు జిల్లా వాసులు మృతి
విశాఖ: కాకినాడ రూరల్ మండలంలోని సర్పవరం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు-టిప్పర్ ఢీకొన్నాయి. కారులో ఉన్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందిన సుంకర పద్మావతి (59), కొల్లు దీప్తి (48)గా గుర్తించారు. డ్రైవర్ అనుదీప్ గాయపడ్డాడు. సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.