స్మశాన వాటిక కోసం నిరాహార దీక్ష
NLG: నల్గొండలోని 14,15,16వ వార్డుల పరిధిలో హిందూ స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ BJP 2టౌన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. చర్లపల్లి సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతోనే ఈ నిరసన చేపట్టామని తెలిపారు.