భారీ వాహనాల రాకపోకలు ప్రారంభం

MNCL: అభివృద్ధి కోసం భారీ వాహనాల రాకపోకలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం జన్నారం మండలంలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద భారీ వాహనాల రాకపోకలను అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. భారీ వాహనాలను అనుమతించాలని మండల ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారని, దానికోసం ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు ఇప్పించడం జరిగిందన్నారు.