ఫుట్‌పాత్‌పై జాతీయ పక్షి వాకింగ్..!

ఫుట్‌పాత్‌పై జాతీయ పక్షి వాకింగ్..!

TG: HYDలోని కేబీఆర్ నేషనల్ పార్క్ నుంచి ఒక నెమలి జనారణ్యంలోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఈ జాతీయ పక్షి ఎంతో క్రమశిక్షణతో ఫుట్ పాత్ మీద నడుస్తూ కనిపించింది. వాహనాల రద్దీ ఉన్నప్పటికీ.. ఏమాత్రం బెదురు లేకుండా అది సాగిపోతున్న తీరు స్థానికులను ఆకట్టుకుంది.