‘నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి’
ASF: నీట్ జాతీయస్థాయి వైద్య ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ సూచించారు. కలెక్టరేట్‌లో RDOతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 336 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.