దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

NRPT: దొంగతనాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ శివశంకర్ మంగళవారం అన్నారు. నారాయణపేట పట్టణంలోని బ్యాంకులు, ఎటిఎం కేంద్రాలు, బస్టాండ్ వద్ద ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రజల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాగులను పరిశీలించారు. బ్యాంకుల నుండి నగదు తీసుకెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్సై వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.