మద్దనూరు ప్రజలకు గమనిక

మద్దనూరు ప్రజలకు గమనిక

KDP: 2025-26 సంవత్సరానికి మద్దనూరు బస్టాండ్‌లో వాహనాల రుసుం వసూలు హక్కు, జంతువధ శాలల కోసం ఇవాళ సాయంత్రం 3 గంటలకు వేలం నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి నరసింహులు తెలిపారు. బస్టాండ్‌కు రూ. 4 లక్షలు డిపాజిట్, జంతువధశాలకు రూ. 40 వేలు చెల్లించి వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.