VIDEO: JPN రోడ్ ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం
వరంగల్ నగరంలోని JPN రోడ్ దత్తాత్రేయ ఫర్నిచర్ షాప్‌లో శనివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కాగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.