VIDEO: శేషపానుపు అవతారంలో శ్రీ జగన్నాథుడు

SKLM: రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీకాకుళంలోని గుజరాతి పేటలో వెలసిన శ్రీ జగన్నాథుడు శేషపానుపు (విష్ణుమూర్తి) అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఏకాదశి సందర్భంగా ఉదయం స్వామికి నిత్య పూజా, విశేష అర్చనలు, మేలుకొలుపు నిర్వహించారు. కాగా స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సోమవారంతో ఈ రథయాత్ర ముగుస్తుంది.