VIDEO: నల్గొండలో నిరుపయోగంగా పెద్ద గడియారం
నల్గొండ పట్టణ నడిబొడ్డున ఉన్న పెద్ద గడియారం గత ఏడాది కాలంగా పనిచేయక నిరుపయోగంగా మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉన్నా, దీనిని అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, గడియారానికి మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.