రెండో భద్రాద్రిగా' విరాజిల్లుతోన్న మిర్యాల రామాలయం
SRPT: జిల్లా నూతనకల్(M) మిర్యాల గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం 'రెండో భద్రాద్రి'గా విరాజిల్లుతోంది. కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ క్షేత్రం, శ్రీరామనవమి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సంతాన రాముడిగా, పెళ్లి కోరికలు తీర్చే దైవంగా భక్తుల విశ్వాసం పొందిన ఈ ఆలయంలో 80 అడుగుల గాలిగోపురం ప్రత్యేక ఆకర్షణ. 10 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి.