VIDEO: గుండెపోటుతో దేవాలయంలో భక్తుడు మృతి..

VIDEO: గుండెపోటుతో దేవాలయంలో భక్తుడు మృతి..

JGN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. తొర్రూరు మండలం చిన్నవంగరకు చెందిన పాకపాటి సోంరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కార్తీక మాసం కావడంతో దైవదర్శనానికి వచ్చి, గర్భాలయంలో కింద పడిపోయాడు. అతడిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.