ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

NGKL: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. బస్టాండ్ ముందు జరిగిన ధర్నాలో పాల్గొన్న ఆయన, ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని అమలు చేయాలని, కార్మికుల న్యాయమైన హక్కులను కాపాడాలని కోరారు.