'ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందించాలి'

'ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందించాలి'

PDPL: ఆరోగ్య సేవలు సమర్థంగా అందించాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వాణిశ్రీ పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి పట్టణ యూపీఎచ్‌సీ పెద్దకాల్వల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని సందర్శించి పరిశీలించారు. టీకా కార్యక్రమాలను సమయానికి పూర్తి చేయాలని, మందుల గడువు తేదీలను పరిశీలించి వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.