రేపు విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు
WNP: జిల్లా పరిధిలోని విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సును సోమవారం ఉదయం 11 గంటలకు వనపర్తిలోని విద్యుత్ డివిజనల్ ఇంజినీర్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు TGSPDCL ఎస్ఈ రాజశేఖరమ్ ఆదివారం తెలిపారు. ఈ అవగాహన సదస్సులో విద్యుత్ సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.