VIDEO: విభిన్న ప్రతిభావంతులకు స్కూటర్ల ఇంటర్వ్యూలు
గుంటూరులో శారీరక విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల స్కూటర్ల పంపిణీ కోసం బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో 158 మంది అభ్యర్థులు హాజరయ్యారు. బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ అధ్యక్షతన జిల్లా ఎంపిక కమిటీ ఈ ఇంటర్వ్యూలను చేపట్టింది.