రేపు డీడీఆర్‌సీ సమావేశం

W.G: జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం ప.గో. జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు భీమవరం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు.