ఘనంగా శనేశ్వర స్వామి కళ్యాణోత్సవం

CTR: వీకోట మండలం పాపేపల్లి గ్రామంలో శనేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండువగా చేశారు. ఈ మేరకు శనివారం శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.