'జగనన్న ఇచ్చే ప్రతీ బాధ్యత సంతోషంగా నిర్వర్తిస్తా'
KRNL: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా తనకు ఇచ్చిన బాధ్యతను సంతోషంగా నిర్వర్తిస్తానని మాజీ MP బుట్టా రేణుక అన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న మిమ్మిల్ని ఎందుకు మార్చారని విలేకరులు ప్రశ్నించగా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి బాధ్యతను ఎంతో గౌరవంగా భావిస్తానని సమాధానం ఇచ్చారు. తాను ఎప్పుడూ పదవులు అడగలేదన్నారు.