ఒకే కుటుంబం.. మూడు ప్రాణాలు

ఒకే కుటుంబం.. మూడు ప్రాణాలు

SKLM: లావేరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. గారలోని అత్తవారింటికి జాతరకు వెళ్లి తిరిగి బైక్‌పై వస్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేశ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం సుజాత మృతి చెందింది. ప్రస్తుతం రెండేళ్ల చిన్నారి ధాత్రి శ్రీ మృత్యువుతో పోరాడుతోంది. భార్యాభర్తలు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకొన్నాయి.