జిల్లాలో ఘనంగా జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
ASR: రాజవొమ్మంగిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆద్వర్యంలో ఆదివారం డా. జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోర్తా బుజ్జి బాబు మాట్లాడుతూ.. జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను గుర్తుచేసి, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అయినవల్లి అనిల్, పిల్లి కిరణ్,యువత పాల్గొన్నారు.