‘డీజీపీపై కేటీఆర్ వ్యాఖ్యలు అనాగరికం’
TG: డీజీపీ శివధర్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అనాగరికం, అసభ్యంగా ఉన్నాయని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలంటూ సంఘం చీఫ్ వై. గోపిరెడ్డి డిమాండ్ చేశారు. తాము చట్టానికి, ప్రజలకు ప్రాధాన్యమిస్తామని స్పష్టంచేశారు.