VIDEO: ఈతేరు హత్య కేసు.. నిందితుడు అరెస్ట్

VIDEO: ఈతేరు హత్య కేసు.. నిందితుడు అరెస్ట్

BPT: ఈతేరు గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడు కోటేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు శనివారం బాపట్ల డీఎస్పీ జగదీశ్ నాయక్ తెలిపారు. ఈ నెల 12న తన భార్యపై ఉన్న అనుమానంతో వెంకటేశ్వరరావుపై కోటేశ్వరరావు కత్తితో దాడి చేయగా.. తీవ్ర గాయాలతో బాధితుడు మృతి చెందాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.