చిత్తూరులొ ఉప కేంద్రాల్లో ప్రత్యామ్నాయ లైన్లు

చిత్తూరులొ ఉప కేంద్రాల్లో ప్రత్యామ్నాయ లైన్లు

CTR: విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు అధిగమించడానికి సబ్ స్టేషన్లలో ప్రత్యామ్నాయ లైన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్ఈ సురేంద్రనాయుడు ఆదేశించారు. ఇంజినీర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాల నివారణకు ఇంజినీర్లు, అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. నియంత్రికల విఫలమయ్యే పరిస్థితులను తగ్గించాలని సూచించారు.