నెల్లూరులో రెండు రోజులు వాటర్ సరఫరా బంద్
నెల్లూరులోని 4వ డివిజన్ నుంచి 10వ డివిజన్ వరకు రెండు రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. తోటబడి పంపు హౌస్లో ట్రాన్స్ ఫార్మర్ మారుస్తున్న కారణంగా తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. గురువారం సాయంత్రం నుంచి యథావిధిగా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు.