VIDEO: ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన
SRCL: ఆశ వర్కర్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. గత ప్రభుత్వంతో కూడా ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుత ప్రభుత్వంతో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.