అద్దె గదిలో గ్రామపంచాయతీ వ్యవహారాలు

అద్దె గదిలో గ్రామపంచాయతీ వ్యవహారాలు

NRPT: దామరగిద్ద మండలంలో తాండ గ్రామపంచాయతీ ఒక చిన్న అద్దె గదిలో పాలన వ్యవహారాలు జరుగుతున్నాయి. పంచాయతీ భవనం రెండేళ్ల కిందటనే మంజూరైనప్పటికీ గుత్తి దారుకు బిల్లులు మంజూరు చేయకపోవడం వలన మధ్యలోనే ఆపేశారు. ఇప్పటికైనా బిల్లు మంజూరు చేసి తమ గ్రామానికి పంచాయతీ భవనం అందించాలని గ్రామ సర్పంచ్ శరణ్య నాయక్, వార్డు మెంబర్స్ ఉన్నత అధికారులను అభ్యర్థిస్తున్నారు.