VIDEO: 'బీసీలకు ప్రధాని అన్యాయం చేస్తున్నారు'
HYD: ప్రధాని మోదీ బీసీలను తడిగుడ్డతో గొంతు కోస్తున్నారని తెలంగాణ బీసీ JAC ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం ముందు బీసీ జేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ మహిళలకు ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని, బీసీ మహిళల వాటా లేకపోతే సామాజిక న్యాయం ఎలా సాధ్యమన్నారు.