'వసతి గృహ విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి'
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల అధికారులు, గురుకుల పాఠశాలల డిప్యూటీ వార్డెన్లకు మంగళవారం విద్యార్థుల సంక్షేమం పట్ల కలెక్టర్ బాలాజీ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ మేరకు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహారం, త్రాగునీరుతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.