గుత్తికోయలకు సోలార్ లైట్లు పంపిణీ చేసిన సీతక్క

ములుగు: HDFC బ్యాంకు ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ములుగు జిల్లాలోని వెంకటాపూర్, పస్రా, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుత్తి కోయ ప్రజలకు మొదటి విడతగా 50 సోలార్ లైట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో HDFC బ్యాంకు సర్కిల్ హెడ్ విశాల్ బాటీయా, మహేష్, ములుగు HDFC బ్రాంచ్ మేనేజర్ సురేష్ పాల్గొన్నారు.