డబ్బులు వసూలు చేసిన ఆరుగురు రిపోర్టర్లపై కేసు
ADB: ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి అక్రమంగా డబ్బులు రూ.60 వేలు వసూలు చేసిన ఘటనలో ఆరుగురు రిపోర్టర్లపై కేసు నమోదు చేసినట్లు బోథ్ CI గురు స్వామి తెలిపారు. మొదట ముగ్గురిపై కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉండగా.. ఆదివారం ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురిలో ఒకరిని అరెస్ట్ చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారని సీఐ వెల్లడించారు.