'నాణ్యత ప్రమాణాలతో కూడిన రేషన్‌ను అందించాలి'
EG: అమలాపురంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో రేషన్, ఎల్పీజీ గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన రేషన్ నిత్యావసరాలను పూర్తి బరువుతో, నిర్ణీత ధరకు అందించి ప్రజాసంతృప్తి స్థాయిలను మెరుగుపరచాలని ఆమె డీలర్లను ఆదేశించారు. డీలర్లు మంచి ప్రవర్తనతో కూడిన సేవలను పారదర్శకంగా అందించాలని సూచించారు.