VIDEO: 'ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి'
KMM: మధిర మండల కేంద్రంలో మండలానికి చెందిన ఆశ వర్కర్లు సోమవారం సీఐటియు నాయకుల ఆధ్వర్యంలో భారీగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనంగా రూ. 18000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనేక విధంగా తమ శ్రమను దోపిడీ చేస్తున్నారని వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.