VIDEO: మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా ఆర్డీవో
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా ఆర్డీవో వివి.రమణ ఇవాళ ఉదయం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది స్పెషలాఫీసర్ అయిన ఆర్డీవోకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.