తాహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
MLG: ఏటూరునాగారం పట్టణ కేంద్రంలోని తాహసీల్దార్ కార్యాలయాన్ని ఇవాళ డిప్యూటీ కలెక్టర్ కుషిల్ వంశీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.