జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు

జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు

తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. రాజధాని అంశంపై జగన్ మాట్లాడుతున్నది అర్థంలేదని అన్నారు. అమరావతికి చట్టబద్ధత ఇస్తే పేరును మార్చాలని చెప్పడం సరైంది కాదన్నారు. అధికారులను కులం పేరుతో దూషించడం తప్పని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.