ఘనంగా నందీశ్వరుడు విగ్రహ ప్రతిష్ట
KKD: ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో నందిశ్వరుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.