రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
NZB: నగరంలోని సుభాష్ నగర్లో ఓ పాఠశాలకు చెందిన విద్యార్థిని వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. 8వ తరగతి చదువుతున్న దీక్షిత జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చింది. దీంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. బుధవారం వైస్ ప్రిన్సిపాల్ భావన, వాలీబాల్ కోచ్ సాయిలు అభినందించారు.