చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
KMR: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధారిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన చిరంజీవి అక్టోబర్ 31న తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.