బీమా కోసం భర్తను చంపించిన భార్య

బీమా కోసం భర్తను చంపించిన భార్య

KMM: బీమా సొమ్ము కోసం భర్తనే కడతేర్చిన కిరాతక ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. ప్రమాద బీమా కోసం తన భర్తను నలుగురు వ్యక్తుల సహాయంతో హత్య చేయించి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు భార్య ప్రయత్నించింది. ఈ కేసును ఛేదించిన ఖమ్మం పోలీసులు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి ఒక కారు, ఆటో, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.