కేంద్రంపై ఒవైసీ ప్రశ్నల వర్షం
TG: పశ్చిమ ఆసియాలో భారత్ తటస్థ వైఖరిని ప్రధాని మోదీ పక్కన పెట్టారని ఒవైసీ విమర్శించారు. ఇజ్రాయెల్, అమెరికా నేతలతో అతి సాన్నిహిత్యం వల్ల గల్ఫ్‌లో భారత్ పట్టు కోల్పోయిందని అన్నారు. 'అక్కడ సుమారు కోటి మంది భారతీయులు పని చేస్తున్నారు. యుద్ధం తీవ్రమైతే వారి ఉపాధి పోయి తిరిగి భారత్‌కు వస్తే, వారికి మోదీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా' అని ప్రశ్నించారు.