ఇరాన్ యుద్ధంలో డిజిటల్ విప్లవం
ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం క్షిపణులకే పరిమితం కాలేదు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి 'ఏఐ యుద్ధం'గా చరిత్రలో నిలిచిపోనుంది. ఒకప్పుడు సైనికుల మేధస్సు, ధైర్యంపై ఆధారపడిన యుద్ధాలు, ఇప్పుడు అల్గారిథమ్స్, డేటా అనలిటిక్స్ వైపు మళ్లాయి. ఇజ్రాయెల్ అమలుచేస్తున్న ఆధునిక యుద్ధతంత్రం భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలకు మార్గదర్శనం కానుంది.