ఫేస్‌వాష్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి?
చలికాలంలో ముఖాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోమ్(నురగ) ఆధారిత వాష్‌లకు బదులు జెంటిల్, క్రీమ్ తరహా క్లెన్సర్లను వాడాలి. అలాగే ఒకే సమయంలో రెండుసార్లు ముఖం కడగొద్దు. చర్మతత్వాన్ని బట్టి ఫేస్‌వాష్‌ను వాడాలి. ముఖ్యంగా ఎక్స్‌ఫోలియేషన్ పద్ధతిని ఎక్కువసార్లు చేయకూడదు. వేడి నీటికి బదులు చల్లటి లేదా గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి.