నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
SRPT: విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడానికై సోమవారం ఉ. 8 గంటల నుంచి మ. 12 గంటల వరకు జాజిరెడ్డిగూడెం విద్యుత్ సబేస్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అధికారులు నిలిపివేయనున్నారు. ఈ మేరకు మండల విద్యుత్ ఏఈ శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. పర్సాయపల్లి, తుంగగూడెం, సూర్యనాయక్ తండా ఫీడర్ల పరిధిలో సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. వినియోగదారులు గమనించి సహాకరించాలని కోరారు.