తిరుపతిని మెగాసిటీగా మారుస్తాం: మంత్రి

తిరుపతిని మెగాసిటీగా మారుస్తాం: మంత్రి

AP: రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లు ప్రధాన సమస్యగా మారాయని మంత్రి నారాయణ వెల్లడించారు. వైసీపీ హయాంలో తణుకులో రూ.50 కోట్ల విలువైన బాండ్లను రూ.750కే జారీ చేశారని ఆరోపించారు. తిరుపతికి వచ్చిన 1077 బాండ్లలో 709 మంజూరు చేశారని.. ఇంకా 368 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిలో న్యాయపరమైన సమస్యలు 59 ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతిని మెగాసిటీగా మార్చేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు.