ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
MDK: పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టామని ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ అన్నారు. మద్దూర్ గ్రామంలో ఈ పథకం ద్వారా నిర్మించుకున్న నీరుడి సుశీల-నరసింహుల నూతన గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.