అవినీతి బకాసురుడి దిష్టిబొమ్మ దహనం
KRNL: రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి పెరిగిపోతోందని ఆరోపిస్తూ సంబంధిత అధికారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు మంగళవారం ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అవినీతి బకాసురుడి దిష్టిబొమ్మను దహనంచేసి నిరసన వ్యక్తంచేశారు. యూనివర్సిటీలో ఓ అధికారి బకాసురుడిలా మారి నిధులను అడ్డగోలుగా దోచుకుంటున్నాడని ఆరోపణలు చేశారు.