ఘోర ఓటమిపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన

ఘోర ఓటమిపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన

బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో ఓటమిపై ఏఐసీసీ ఆత్మపరిశీలన సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఫలితాలపై దాదాపు గంటకుపైగా సమాలోచనలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించారు.