'ఉగ్రదాడిని యుద్ధ చర్యగా పరిగణిస్తాం'

'ఉగ్రదాడిని యుద్ధ చర్యగా పరిగణిస్తాం'

సౌత్ వెస్ట్ ఆర్మీ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ మంజీందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో జరిగే ఏదైనా ఉగ్రవాద దాడిని యుద్ధ చర్యగా పరిగణిస్తామని తేల్చి చెప్పారు. తమ దృష్టి గరిష్టంగా రాత్రివేళ శిక్షణపై ఉందని, అందువల్ల తాము 70% శిక్షణను రాత్రిపూట, 30% పగటిపూట నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కోవడంలో భారత సైన్యం సన్నద్ధతను ఈ సందర్భంగా ఆయన వివరించారు.