పాఠశాలలో అంబేద్కర్ విగ్రహం నిర్లక్ష్యం

పాఠశాలలో అంబేద్కర్ విగ్రహం నిర్లక్ష్యం

ASR: అనంతగిరి మండలం కొత్తవలసలోని ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఉన్న డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్లక్ష్యానికి గురవుతోంది. 2022లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి ముక్కు, కళ్ల అద్దాలు విరిగిపోయినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడం బాధాకరమంటున్నారు.